ఆత్మ జాగృతి కొన్ని అపోహాలు, వాస్తవాలు.

*”ఆత్మ జాగృతి” :: కొన్ని అపోహలు, వాస్తవాలు*
*~~~~~~~~~~~~~~~~*
–   సద్గురు శ్రీ మెహెర్
           చైతన్యజీ మహరాజ్

(పార్ట్ – 5)

*ప్రశ్న :: _”యజ్ఞాలు-యాగాలు” అనవసరమన్నారు కదా. మరి “పూజలు-పునస్కారాలు” కూడా అనవసరమేనాండీ ??_*

*గురుదేవులు :: అనవసరమేనండీ !*
ఇవన్నీ మన
“మానసిక తృప్తి” కోసం
చేసినటువంటివి.
మనం
కల్పించుకున్నటువంటి
“కల్పన”లు.
*”భగవంతుడి”కి ఇవేమీ అక్కర లేదు. ఆయనకు కావలసింది మన “పవిత్ర హృదయం”, మన “ప్రేమ”. అదీ కావలసింది.*

*ప్రశ్న :: _”జపం”, “ధ్యానం” అనేవి ఎంతకాలం చెయ్యాలి, ఎప్పుడు ఆపెయ్యాలి ??_*

*గురుదేవులు ::*
* “భగవంతుణ్ణి” మీరు
ధ్యానించుకోవాలి
అనుకున్నా,
* ఆయన్ని హృదయంలో
నిలుపుకోవాలి
అనుకున్నా,
*ఈ పటాటోపాలు – ఈ “పూజలు”, ఈ “అలంకరణ”లు – ఇవన్నీ అక్కర్లేదండీ.*
ఇదంతా కూడా –
“ప్రాథమిక విద్య”కు
సంబంధించినటువంటి
– ఈ అక్షరాలు
దిద్దడము,
– అక్షరాలు
నేర్చుకోవడము,
– అక్షరాలు
కలుపుకోవడము
వీటికి
సంబంధించినటువంటివి.
దానితోనే
పరిమితమైపోయి
ఉండకూడదు.
*మీరు కొంత కాలము “జపము” చేసారనుకోండి. జీవితమంతా “జపము” చెయ్యకూడదు.*
_అది ఎందుకు_
_ఉద్దేశింపబడిందో,_
_వెంటనే,_
_ఆ “పని” అయిపోగానే_
_విడిచి పెట్టేసేయ్యాలి !_
*(ఉదా.,కు) చదవడం నేర్చుకున్నారనుకోండి. నేర్చుకున్న తరువాత, ఇంక “అక్షరాలు దిద్దడం ప్రారంభించాను కదా” అని రోజూ, (జీవితాంతం) అక్షరాలు దిద్దుతూ ఉంటామా ? దిద్దుకోము కదా ! అలాగే*
కొంతకాలం “జపం”
చేసుకుంటాము;
ఆ “అవసరము”
తీరిపోతుంది.
(మరల) కొన్నాళ్ళు
“ధ్యానం” చేసుకుంటాము.
ఆ “అవసరము”
తీరిపోతుంది;
దాన్ని
మరచిపోగలగాలి.
అది మనల్ని
బంధించకూడదు.
*ఇంక తరువాత, లోపలికి వెళ్ళాలి. “ఆత్మానుభూతి” ! (అంటే)*
ఏ “ధ్యానము”
– ఏ “ఆత్మానుభూతి”కి
ఉద్దేశింపబడిందో,
– ఇంద్రియాలను
(“ప్రాణశక్తి”ని)
అంతర్ముఖపరచడానికి
ఉద్దేశింపబడిందో,
అలాగ
“అంతర్ముఖ-
పరచబడేటప్పుడు”,
ఇంక ఈ
“బాహ్యమైనటువంటి
పరికరాలన్నీ”
విడిచి పెట్టేసేయాలి.
*ఇవేమీ మనకు అడ్డు తగలకూడదు.*

*ప్రశ్న :: _మరి already “పూజల్లో” మునిగిపోయినవారిని మాన్పించడం ఎలా ? పూజలు, భజనలు చెయ్యడం మానేస్తే దేవుడు శపిస్తాడేమో ??_*

*గురుదేవులు :: ఇప్పుడు మీరు పది డబ్బులు సంపాదించినప్పుడే – పదిమందికీ “దానం” చేయగలుగుతారు. అదే విధంగా*
వ్యక్తి “ఆత్మానుభూతి”
పొందినప్పుడే,
ఇతరులకి
“ఆత్మానుభూతి”ని
అందించగలడు.
*అంతే తప్ప, బాహ్యమైనటువంటి “ప్రక్రియ”ల ద్వారా, బాహ్యమైనటువంటి “క్రియల” ద్వారా గానీ – అక్కడితో పరిమితుడైపోకూడదు.*

*చూడండి ! ఇప్పుడు పది మందినీ సంతోషపెట్టాలని “భజన కార్యక్రమం” ఏర్పాటు చేసామనుకోండి. ఈ పదిమందీ ఆ “భజన”తోనే తృప్తియైపోతున్నారు.*
ఈ “భజన కార్యక్రమం”
సంబంధమైనటువంటి
కాలాన్ని మీరు
సద్వినియోగపరచి
“ఆత్మానుభూతి” కోసం
మీరు “ప్రయత్నం”
చేసారనుకోండి !
మీరు “ఆత్మానుభూతి”
పొందిన తరువాత
ఎంతమందికి
“ఆత్మానుభూతి”ని
మీరు ఇవ్వగలుగుతారు;
ఎంత
విస్తృతమైనటువంటి
సహాయాన్ని మీరు
అందించగలుగుతారు.
ఒక్కసారి
ఆలోచించండి !
*అందుచేత, వ్యక్తి ఎక్కడికక్కడ*
– బంధింపబడిపోకూడదు,
– ఆగిపోకూడదు.
*ఇది ఒక మహా ప్రవాహం. అలాగ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి.*

*అందుచేత, వ్యక్తి యొక్క సంస్కారానుగుణ్యముగా*
– కొంతమందికి “పూజ”
ఇష్టమౌతుంది;
– కొంత మందికి
“వ్రతాలకు”
ఇష్టమౌతుంది.
*ఆచరించనివ్వండి ! కానీ, దానికి బంధింపబడిపోకూడదు.*
_అది ఎంతవరకూ_
_అవసరమో, అంతవరకూ_
_పాటించడం,_
_ఆ తరువాత_
_విడిచిపెట్టేయగలగాలి._
*విడిచిపెట్టడానికి భయం. (ఉదా.,కు) ఇప్పుడు మెహెర్ బాబాకి ఈ పూలదండ వెయ్యకపోతే, మెహెర్ బాబాకు ఏమి కోపమొస్తుందో, ఏమి “అపకారం” చేస్తాడో !*
_”అపకారం” చేసేవాడు_
_”దేవుడు” ఎలాగ_
_అవుతాడండీ !

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/