ఆత్మ దర్శనం

🌹 *వివేక చూడామణి* 🌹
*47 వ భాగము*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
🍃 *ఆత్మ దర్శనం – 3*  🍃

* ఆకాశానికి వలె నాకు ఏ మాత్రము మకిలి అంటదు. కనిపిస్తున్న వస్తువులన్నింటి కన్నా ప్రత్యేకమైనవాడను. అలా నేను సూర్యుని వలె ప్రకాశించెడి వస్తువులన్నింటికి వేరైన వాడను.*

* నాకు శరీరముతో సంబంధము లేదు. ఎలా అంటే ఆకాశానికి మేఘాలతో సంబంధములేనట్లు. అందవలన ఏవిధముగా మెలుకవ స్థితిని, కలలోని లేక గాఢ నిద్రలోని శారీరక స్పందనలు నాకు వర్తించవు కదా!*

* ఉపాధి అనేది రూపొందుతుంది. అది వస్తుంది, పోతుంది. అది మరల కర్మలు చేసి అనుభవములు పొంది అది క్రమముగా అంతమై నశిస్తాయి కానీ నేను ఆత్మను సదా స్థిరముగా ‘కులు’ పర్వతము వలె ఉంటాను.*

* నేను ఎల్లప్పుడు అలానే ఉంటాను. ఏ భాగములు లేవు. పనిలో ఉండుట, లేకుండుట అనేది ఏదీ లేదు. అది ఒకే విధముగా మార్పు లేకుండా స్థిరముగా ఆకాశము వలె శాశ్వతముగా ఎపుడు అలానే ఉంటాను.*

* నాకు మంచి చెడులు ఎలా ఉంటాయి? నాకు శరీర భాగాలు లేవు. మనస్సు లేదు. మార్పు లేదు. ఆకారము లేదు. నేను స్వయం బ్రహ్మానంద స్థితిలో ఎల్లపుడు ఉంటూ దేనికి అంటని వాడను.*

* వేడి కాని, చల్లదనము కాని, నన్ను తాకినప్పటికి, నా శరీరము యొక్క నీడ పై ఎట్టి ప్రభావము చూపదు. అది నీడ కంటే వేరుగా ఉంటుంది.*

* వస్తువు యొక్క గుణ గణాలను గమనించినపుడు, ఆ గమనించిన వానిపై ఆ గుణాల ప్రభావము అంటదు. అది మార్పు చెందనిది. అన్నింటికి వేరుగా ఉంటుంది. ఎలానంటే గది యొక్క లక్షణములు, గదిలోని దీపమునకు అంటవు. కాని దీపము యొక్క కాంతి వస్తువులను ప్రతిఫలింపజేస్తుంది.*

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/