ఏకాంతము

ఇంట్లో ఏకాంతం లేదు,
బయట సత్సంగంకు వెళ్ళడానికి వీలు కుదరడం లేదు,
ఇలా అయితే నా సాధన సాగేదేలా?
తీవ్ర సాధన చేస్తేనే కదా, పరమాత్మను కాంచగలం …అయ్యో … ఇలాగైతే ఎలా … లోలోన ఇదే వేదన …!

“అసలు ఏకాంతమంటే – బైట ప్రపంచం నుంచి విడినివాసం కాదు.
ఏకాంతమంటే – ఆలోచనారహిత స్థితి.
ఏకాంతమంటే – ఆత్మలో స్థిరంగా నిలవడం.

మనల్ని తరిమేది మన మనస్సే.
ముందు దాన్ని అదుపులో ఉంచుకోవాలి.
అప్పుడు మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆనందంగా హాయిగా ఉండవచ్చు.
ఉన్నచోట నే ఈశ్వరుని దర్శించుకోవచ్చు…
నిశ్చలమనస్సుతో శ్రద్ధగా సాధన చేయవచ్చు.
బైట సత్సంగం వుంటుంది అంటున్నాము,
అది వేరు, అసలైన సత్సంగం మన లోనే ఉంటుంది. అదే నిజమైన ఏకాంతం..
మనస్సులోని సంగతి. మనష్యుల మద్య మసలినా, మనోపవిత్రతను నిలుపుకున్నవాడు ఏకాంతవాసే…
అడవిలో, నిర్జన ప్రదేశంలో వుండి, ఆలోచిస్తూ వుంటే, అది ఏకాంతవాసమా?
*అనాసక్తుడు ఎప్పుడూ ఏకాంతవాసే”.*

  *_☘శుభమస్తు☘_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/