పుణ్యక్షేత్రాల సందర్శన వలన లాభం కలుగుతుందని భావించవచ్చా ?

Color Brands

మన ప్రవృత్తులను వదిలించుకోకుండా ఎన్ని క్షేత్రాలు తిరిగినా ప్రయోజనం శూన్యం. పుణ్యక్షేత్రం వెళ్ళినా సినిమా పిచ్చి వదలదు. ఆ లోపం మన బలహీనతదేకానీ పుణ్యక్షేత్రం క్షేత్ర దివ్యత్వానిది కాదు. మన వంకలన్నీ ‘ఆడలేక మద్దెలోడు’ అన్నట్లుగా ఉంటాయి. సాధన కోసం దైవంపై ఇష్టం పెంచుకోవడానికి బదులు వంకలు వెదుకుతుంటాం. మనసు బాగు చేసుకుందామని క్షేత్రానికి వెళ్తాం. ఆ క్షేత్రాన్ని విమర్శించి మనసును మరింత పాడుచేసుకొని తిరిగి వస్తాం. వికారాలకు అతీతమైనది మనసు. కానీ పరిసరాలకు, పరిస్థితులకు అది లొంగిపోతుంది. ఆ మనసుకు తిరిగి స్థిరత్వం రావాలంటే అనవసర ఆరాటాలు తగ్గాలి. ఆత్మవిచారణతో ముందుకు సాగాలి.

(ఆధార గ్రంథం : “శ్రీరమణీయం)(అధ్యాయం-28) {శ్రీరమణభాషణలు సత్సంగ ప్రవచనము)

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/