మన గుణములను బట్టి, మన స్వభావాన్ని బట్టి మనకు శరీరము వస్తుంది.

Color Brands

మన గుణములను బట్టి, మన స్వభావాన్ని బట్టి మనకు శరీరము వస్తుంది. మనకు ఇలాంటి శరీరము మరల రాకూడదు అనుకుంటే ఈ లోపల శరీరములో ఉండకూడని భావములు ఇపుడే తీసివేయాలి. ఇప్పుడు మార్చుకోకపోతే మరల అదే వస్తుంది. అదే మూస. శరీరము మరణించినంత మాత్రమున స్వభావము మరణించదు. మరల ఇంకో శరీరము ధరించి మరల అదే స్వభావముతో అవే పనులు కొనసాగించడం జరుగుతుంది.

అందుకే మరణాలు మూడు రకాలు అని పెద్దలు చెపుతారు. శరీరంతో మరణము ఒకటి. స్వభావంతో మరణము రెండవది. అహంకారముతో మరణము మూడవది.

*భాగవతము*

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/