మాఘ పౌర్ణమి విశిష్టత

రేపు మాఘ పౌర్ణమి..!!
ఓం నమః శివాయ..!!

మాఘ పౌర్ణమి విశిష్టత.
మాఘపూర్ణిమ , మహా మాఘి
ఇది విశేష పర్వదినం.
స్నానానికి ప్రాముఖ్యమైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయం ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగా
చేసే స్నానం) ఈ రోజునైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి.

ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం.
తిధుల్లో ఏ పూర్ణిమ అయిన సంపూర్ణంగా దైవీశక్తులు దీవించే పుణ్యతిధే.
ఈ తిధినాడు ఇష్టదేవతారాధన, ధ్యాన జపాది అనుష్టానాలు మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి.

ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది.
అన్ని పూర్ణిమల్లోకి మఘ, కార్తీక, వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతొ ఉత్కృష్టమైనవి.
వాటిని వ్యర్ధంగా గడుపరాదుని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.

వైశాఖీ కార్తీకీ మాఘీ
తిథయో౭ తీవ పూజితాః!
స్నాన దాన విహినాస్తా
ననేయాః పాండునందన!!

స్నానదాన జపాది సత్కర్మలు లేకుండా వృథాగా
ఈ మూడు మాసాలు పూర్ణిమలను గడుపరాదు.

మాఘ పూర్ణిమ నాడు ” అలభ్య యోగం ” అని కూడా అంటారు.
అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా
అది గొప్ప యోగ మవుతుంది.
అది అంత తేలికగా లభించేది కాదు.

స్నానంం చేస్తున్నప్పుడు పఠించాల్సిన శ్లోకం.

దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం

మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ”

అని పఠించి, మౌనంగా స్నానం చేయాలి,
అంటే “దుఃఖములు, దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ
ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను.

కనుక ఓ గోవిందా! అచ్యుతా! మాధవా!
ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు”
అని అర్థం.

ఆ తరువాత …
“సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ
త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా”

అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి.
అంటే “ఓ పరంజ్యోతి స్వరూపుడా!
నీ తేజస్సుచే నా పాపములు సర్వము
వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు
బడి నశించుగాక” అని అర్థం.

ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత, పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని,
ఇష్టదైవాన్ని ఆరాధించాలి.
ఆ తర్వాత, దానధర్మాలు చేయాలి.
వస్త్రములు, కంబలములు [దుప్పటిలు],
పాదరక్షలు, గొడుగు, తైలము, నెయ్యి, తిలపూర్ణఘటము, బంగారము, అన్నము
మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది.

ఓం నమః శివాయ..!!
సర్వే జనా సుఖినోభవంతు..!!

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/