మేధస్సుకు శ్రమ లేకుండా విశ్రాంతి కలుగుతుంది

*సోమనాథ మహర్షులవారి*
*దివ్య సందేశం 1/1997*
🌺🌺🌺🌺🌺
ఈ యోగమార్గం అగు సాధనలో మనస్సులో ధ్యానము జరుగుచున్నది అనే భావనపై శాశ్వత నిర్ణయం నిరంతరం ఉండవలెను.ఈ విధముగా సాధనను పనుల కాలములోనే కాకుండా తీరిక సమయాల్లో గంట,గంటన్నరకాలం మనస్సులో ఏ సంకల్పం లేకుండా నిశ్చలముగా కుర్చుని ఆత్మను గమనిస్తూ ఉండవలెను .ఈ విధముగా సాధన, సంసారం అనుభూతులు కలిగించుకొని సాధన చేస్తూ సంసారం చేసుకొనవచ్చును.ఇది సర్వులు చేసుకో గలిగెడి మార్గం.దీని వలన ప్రతి నిత్యం ఒక గంట కాలం అయినను వారిని వారు మరచిపోయి క్రమేణా ఏమి తెలియని స్థితిలో ఉండటం అభ్యాసం అవుతుంది.ఆ విధముగా తనను తాను మరచిపోయెడి స్థితి ఒక గంట కాలం ఏర్పడినను, ఆ సమయములో దేహములో మనస్సు ,బుద్ధి ,భావా లోచనలు ఏమి చేయకుండా ఉంటాయి. అపుడు మేధస్సుకు శ్రమ లేకుండా విశ్రాంతి కలుగుతుంది .ఈ విధముగా మనోస్థిరత్వం కలుగుటవలన దేహమునకు చాలా వరకు ఆరోగ్యం చేకూరును. మరియు నిత్య జీవితములో కలిగేడి దేహశ్రమ,చికాకు,కోపం, విసుగు ,అధైర్యం ,భయం మొదలగు వాటికీ లోనుకాకుండా ఉండవచ్చును.ఈ మార్గం వలన నరముల వ్యాధులు,జీర్ణాశయ సంబంధ వ్యాధులు,తల నొప్పి,మానసిక వ్యాధులు తొలిగిపోయి సర్వులూ ఆరోగ్యముగా సుఖముగా జీవించవచ్చును.అప్పుడే మనకు శాంతి కలుగుతుంది .మనం శాంతిగా ఉన్నపుడు సాటివారిని కూడా శాంతిగా చూడగలుగుతాము. ఈ విధముగా అందరూ ఆచరించినచో విశ్వశాంతి చేకూరుతుంది.మహా సాధనలు చేయలేకున్ననూ,ఈ సాధనను సర్వులూ చేసుకుని ఆనందం పొందవచ్చును.

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/