సత్యాన్ని తెలిపేది వేదం అని అర్ధం.

శ్రీ విద్యా సాగర్ గారి 21 స్పీచెస్, ఫైల్ – 10; పేజి – 2

మనం సాధారణంగా వశిష్ఠులవారు అంటే ఎవరో ఓ గడ్డం పెంచుకుని ఉన్న ఒక మహర్షి అని, కోదండం పట్టుకున్న ఆయన రాముడని అనుకుంటాము. కానీ అవన్నీ కావు, అవి పౌరాణిక పద్ధతిలో అలా చిన్నపిల్లలకు అర్ధం అవ్వటం కోసం ఆ రూపాలలో అలా ఏర్పాటు చేసారు మన పెద్దలు. వశిష్ఠుడనే ఆయన ఒక మహర్షే కానీ, వా సిష్టం అనే పేరులోనే దాని అర్ధం దాగి ఉన్నది. అందులోనే ఉన్నది, నీవు దేన్నీ ఆశ్రయిస్తే జ్ఞానాన్ని పొందుతావో అది సిష్టం. మీది ఏ ఆచారం అంటే శిష్టాచార సంప్రదాయం అంటున్నాం కదా. అంటే అర్ధం ఏమిటంటే ఆ ఆచార సంప్రదాయం ఎక్కడి నుండి ప్రారంభమయ్యిందంటే, దాని లక్ష్యం ఆత్మజ్ఞానమే అయిఉన్నదన్నమాట. ఇలా మనవాళ్ళందరూ ఇప్పుడు ప్రతి దానికి మాది శిష్టాచారా సంప్రదాయమండి మాది వైదికం అండి అంటుంటారు కదా. అదంతా ఏమిటయ్యా అంటే ఆచార సంప్రదాయాలలో ఆత్మ జ్ఞానం ఆచరణలో ఉండాలన్నమాట. అది దానర్ధం. వాసిష్ఠం అంటే విశిష్టం ఐనటువంటిది. అందులోకూడా ఆత్మానుభవం నుండి బ్రహ్మానుభవం దాకా చేరడానికి ఎటువంటి ఆచరణ కలిగి ఉండాలి అటువంటి ఆచరణ కలిగి ఉన్నది వాసిష్ఠ సంప్రదాయం అనమాట. అలా ఏర్పడింది వాసిష్ఠం అనే పేరు. అంతే గాని అది ఎదో మనిషి పేరు కాదు, అది ఒక స్థితి. అలాగే రాముడన్న కూడా ఒక స్థితి మనిషి పేరు కాదు. రాముడనే మహారాజు భారతదేశాన్ని పరిపాలించారు అది వేరే అంశం. కానీ ఈ రెండు స్థితులను ఆధారంగా చేసుకొని వేదాంత విద్యను అందరికి అందుబాటులోకి తెచ్చారు.

108 ఉపనిషత్తుల్లో భాగంగా అతిరహస్యంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసుకొచ్చారనమాట. బయటకు తీసుకొచ్చి అనేకమైన సంప్రదాయాలలో (అంటే కర్మ భక్తి యోగ జ్ఞాన సంప్రదాయాల నాలుగింటిలో) కూడా అనేకరకాల మానవులు ఉన్నారుకాబట్టి, కర్మ సంప్రదాయంలో ఉన్నవారికి కర్మ, అంటే వాడి శక్త్యానుసారం వాడు ఏ మేరకు ఆచరించగలడనే దాన్ని బట్టి ఆయా సాంప్రదాయాలు ఏర్పాటు చేసారు. వేదభాగములలో అన్ని ఉన్నాయి. కర్మ మార్గానికి సంబంధించిన భాగము ఉంది, భక్తికి సంబంధించింది ఉంది యోగానికి సంబంధించింది ఉంది. జ్ఞానానికి సంబంధించింది ఉంది. అట్లాగే బ్రహ్మచర్యము, గృహస్తము, వానప్రస్థము, సన్యాసము అనే నాలుగు ఆశ్రమ ధర్మాలవారు ఎలా ఆచరించాలనే పద్దతిలో కూడా ఆ ఉపనిషత్తులు చెబుతూఉన్నాయి. అయితే సాధారణంగా వైదికం అంటే వేదం = వ + ఇదం అంటే ఉన్నది ఇది, అంటే ఉన్నది ఎదో దానిని గురించి తెలిపేది అని అర్ధం. అంటే లేనిది లేనట్లుగా నిరూపించి ఉన్నది ఉన్నట్లుగా నిరూపించగలగడమేగదా సత్యం అంటే. సత్యం అంటే అర్ధం ఏంటి. లేనిది ఎలా లేదో నిరూపించాలి ఉన్నది ఎలా ఉందొ నిరూపించాలి, అదే సత్యం. కాబట్టి వ ఇదం ఉన్నది ఎదో నిజంగా తెలుపుతుందన్నమాట. సత్యాన్ని తెలిపేది వేదం అని అర్ధం.

Shri Vidya Sagar Gari 21 Speeches – File No: 10 ; Page – 2

We assume that Vasistha means a Sage with a beard and Rama means the one with the Bow and arrow. But that is a wrong assumption. Our elders created that image, so that children can easily understand abstract Philosophical concepts. There is a great Sage by name Vasistha, but here the word Vasistha means that which gives us wisdom. Generally when asked we say that we follow the tradition of Sishthachaara or Vaidika. It means Self-Realisation is the goal of this tradition, or by following this tradition we can achieve Wisdom of Self or Liberation. It means we should practice that tradition or lifestyle according to the Wisdom of Atma or Supreme Soul. Vasistha also means superior. The tradition of Vasistha means the way of life or practices which will lead us from Atmanubhava (Realisation of Atma at Microcasm level) to Brahmanubhava (Realisation of Brahma at Macrocasm level). Therefore Vasistha is not a person it is a level of existence or a plane. Similarly Rama is also a plane of existence, it is not a person. There was a king by name Rama who ruled India, but that is different. These two planes of Vasistha and Rama were used to give abstract Vedantic wisdom to general public.

These 3 philosophical texts of Vasistham (Yoga Vasistha, Gnana Vasistha and Bruhadvaasistha) brought unknown and abstract Vedantic wisdom of 108 Upanishads (The Upanishads, a part of the Vedas, are ancient Sanskrit texts that contain some of the central philosophical concepts and ideas of Hinduism) to general public. This wisdom was made available to all kinds of people following various traditions of Karma, Bhakti, Gnana and Yoga. According to their capacity each and every individual can practice the tradition that suits them. Veda’s consists of all kinds of practices that includes Karma, Bhakti, Gnana and Yoga. Since there are many kinds of people, it is up to the individuals to follow the tradition that they are capable of practicing. Similarly Upanishad’s teach how to practice the 4 Ashrama Dharma’s. Under the Ashram system, the human lifespan was divided into four periods. They are: Brahmacharya (student), Grihastha (householder), Vanaprastha (retired) and Sannyasa (renunciate). The Veda, for orthodox Indian theologians, are considered revelations seen by ancient sages after intense meditation, and texts that have been more carefully preserved since ancient times. Va + Idam = Veda, it means it tells us about that which exists. Truth should explain how the non-existent does not exist and it should prove how the existing reality is present. Therefore Va+Idam Veda means, that which tells us about the reality. That which tells us about the truth is called Vedam.

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/