సర్వారంభ పరిత్యాగీ – నిస్కామకర్మ

Color Brands

సర్వారంభ పరిత్యాగీ కార్యములను పరిత్యజించిన వాడు. అంటే సోమరియా? కాదు. మరి? *నిజంగా ఈ ప్రపంచంలో ఏదీ క్రొత్తగా ప్రారంభం కావటం లేదు. అన్నీ కాలచక్ర గమనంలో జరిగిపోతూ ఉంటాయి. ఈ సత్యాన్ని గుర్తించినవాడు ఇదంతా నేనే చేస్తున్నాను అనే కర్తృత్వభావన లేకుండా అన్నింటికీ భగవంతుడే కర్త. నేను నిమిత్తమాత్రుణ్ణి అనుకుంటాడు. భగవంతుని చేతిలో పనిముట్టుగా, నిరహంకారియై పనులు చేస్తాడు. ఇదే కార్యములను పరిత్యజించుట అంటే. అట్టివాడే నిజమైన భక్తుడు*.
ఒక మంత్రిగారు త్వరలో ప్రభుత్వం పడిపోతుంది అని గ్రహించి, ఈ పదవి ఉన్నప్పుడే త్వరత్వరగా ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేయాలని భావించి, తన అనుచరులకు వార్త పంపాడు. ఆవార్త రావటంతోనే అనుచరులు ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేశారు. కరపత్రాలు ముద్రించారు. మంత్రిగారి సన్మానానికి ఏర్పాట్లుచేశారు. వేదపండితులను సిద్ధం చేశారు. మేళాలు, తాళాలు, నృత్యప్రదర్షనలు, ఉపన్యాసానికి ఒక స్టేజీ అంతా సిద్ధం చేశారు.
ఇక ఆరోజు రానే వచ్చింది. మంత్రిగారిని ఆహ్వానించారు. ఆయన సభా స్థలానికి విచ్చేశాడు. ప్రారంభోత్సవం దేనికో వీరు చెప్పలేదు, ఆయన అడగలేదు. అది ఒక నదీతీరం. వేదపండితులు మంత్రిగారికి సన్మానకార్యక్రమం పూర్తిచేసి, మంత్రిగారిని ఆహ్వానించి నదివద్దకు తీసుకువచ్చారు. అందరూ కలసి నదిలో దిగారు. మంత్రిగారిని చేతులు చాపమని 3 సార్లు చెంబుతో ఆ నదిలో నీటిని ఆయన చేతిలో పోశారు. ఆ! ఇప్పుడు నదికి ప్రారంభోత్సవం అయిపోయింది. ఇప్పుడిక సాంస్కృతిక కార్యక్రమాలు, మంత్రిగారి ఉపన్యాసం ప్రారంభమవుతుంది – అని మైకులో వినపడుతుంటే అందరూ అక్కడికెళ్ళి కూర్చున్నారు. నదికి ప్రారంభోత్సవం అంటే ఈ రోజే ప్రవహిస్తున్నదా నది? కొన్నివందల – లేదా వేలసంవత్సరాల నుండి అలా ప్రవహిస్తూనే ఉన్నది. అయినా ఈరోజు ప్రారంభోత్సవం అట. ఇదే అనవసర అహంకారం. ఎలాగూ జరిగిపోతున్న దానిని నేనే అలా జరిపిస్తున్నానని అహంకరించటం అల్పుల లక్షణం. భక్తుడైన వాడు తాను కేవలం నిమిత్తమాత్రుణ్ణి అని భావిస్తాడు.
ఈ లక్షణాలున్న భక్తుడే నాకు ప్రియుడు అని భగవానుడు తెలియజేస్తున్నాడు.

*To Subscribe* : https://chat.whatsapp.com/Hhr1b22uRHH2Gy3d1HhKPC

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/