సాక్షిత్వం ధారణ

శ్రీ విద్యా సాగర్ గారి 21 స్పీచెస్, ఫైల్ – 10; పేజి – 5

అంతటా అన్నింటిని ఆత్మ స్వరూపంగా చూడగలగడమే ప్రత్యగాత్మ. అలా చూడగలిగినపుడు ఆత్మానుభవం కలుగుతుంది. కాబట్టి వ్యష్టిగా విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యగాత్మ అనేవి సాక్షి స్వరూపాలు. ఉదాహరణ:- మీరు ఎవరినో చూసి ఈవిడ చాల అందంగా ఉన్నది అనుకున్నారు. అంటే ఇప్పుడు మీలో ఎవరు పనిచేస్తున్నారు. కన్ను పనిచేస్తోంది. కన్నుకు దృష్టి విషయం పనిచేస్తోంది. ఈ దృష్టి విషయం ద్వారా నాకు ఆనందం కలుగుతోంది, మెళకువలోనే కదా. కానీ ఈ ఆనందాన్ని గమనిస్తున్నవారెవరు? “నేను”. ఈ నేను సాక్షిగా ఉంటే విశ్వుడు. లేకపోతె ఒక మెట్టు దిగి ఆనందంలోకి వచ్చేస్తే విషయంలోకి వచ్చేసావు. ఇంకా ఒక మెట్టు దిగితే ఆ దృష్టి విశేషం. ఆవిడ అందంగా ఉండటమే సత్యం. ఇంకా ఒక మెట్టు దిగావనుకో ఈవిడతోపాటు నేను స్నేహం చేస్తే బాగుండు. ఆవిడను అలా చుస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు. ఇంకా దిగిపోయావనమాట. ఇంకా కిందకి దిగావు, ఇలాగ దిగిపోతూ ఉంటావు.

జగత్తంతా దృశ్యమే కదండీ. ఏదైనా సరే ఒక దృశ్యాన్ని చూసావు, చూడగానే వెంటనే ఆనందం కలగలేదు, పైన తెలిపిన దంతా, నేను నుండి విషయం తర్వాత ఆనందం వరకు ఒక రెప్పపాటులో పడిపోవడం జరిగిపోయింది, నీ లోపల. ఈ రెప్పపాటు కాలాన్ని నువ్వు చక్కగా విచారణ చేయి, విభజించు. నేను ఎవరిని. నేను ఆత్మ స్వరూపుడిని, మెలకువలో విశ్వుడిని, ముందు మెలకువలో విశ్వుడిదాకా రావాలండి తర్వాత స్వప్నంలో తైజసుడు సంగతి, తర్వాత ప్రాజ్ఞుడి సంగతి తెలుస్తుంది. మెలకువలో సాక్షిత్వమ్ రాకుండా, కలలో, నిద్రలో రాదు. కాబట్టి మెలకువలో నీవు ఏదైనా ఒక పనిలో, ఒక ఆలోచనలో దిగేముందు విచారణ చెయ్యాలి. అది తప్పనిసరిగా ఎదో ఒక ఇంద్రియానికి సంబంధించిన విషయం అయిఉంటుంది. ఒకరెవరో అద్భుతంగ ఒక సంగీత వాయిజ్యం వాయిస్తున్నారనుకోండి. విని ఓహో అద్భుతం గా వాయిస్తున్నారు అనుకున్నావు. అనుకోగానే ఎవరి విషయం ఇది, శ్రవణేంద్రియ విషయం. ఇంద్రియం శబ్దాన్ని గ్రహించింది నేను సాక్షిని. శ్రవణేంద్రియం ఉన్నది, ఆ ఇంద్రియం శబ్దాన్ని విన్నది, ఆనందించింది.

ఇక్కడ మూడు స్థితులున్నాయి –> ఇంద్రియం ఉన్నది, దాని విషయం ఉన్నది, దానికి సంబంధించిన ఆనందం ఉన్నది. ఈ మూడు నేను కాదు, నేనెవరిని? నేను గమనించేవాడను. ఆనందాన్ని కూడా గమనించాను. నేను సాక్షిని, ఆత్మ స్వరూపుడను. ఇప్పుడు సాక్షిగా ఉన్నంతసేపు విశ్వుడు. సాక్షిత్వమ్ పొతే, ఆహా ఏమి పాడిందండి ఎంత అద్భుతంగ అన్నమయ్య కీర్తన పాడింది. ఈవిడలాగా ఎవరూ పాడలేరు అంటే ఆనందంలోకి దిగావు. ఇంకా ఈ పాడే ఆవిడెవరో ఈవిడను చూసొద్దాం ఒకసారి. అంటే సాంతం విషయందాకా వెళ్ళింది. అక్కడదాకా వెళ్ళాక ఇప్పుడు శబ్ద విషయం పోయింది. ఇప్పుడు మనిషికి, కన్నుకు వచ్చింది వ్యవహారం. దృక్విషయానికి వచ్చేసావు. ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి విషయ సముదాయం పనిచేస్తూ ఉంటాయి. అంటే ముందు ఎదో ఒకదానితో మొదలవుతుంది. మొదలైనపుడే నువ్వు దాన్ని చక్కగా పట్టుకొని ఉన్నట్లయితే, దాంట్లోనుండి రెండోది మూడోది నాలుగోది రాకుండా ఉంటాయి. కానీ శబ్దం దగ్గర మొదలుపెట్టి తర్వాత రూపం దగ్గరకు వెళ్ళావు, తర్వాత శబ్ద స్పర్శ రూప రస గంధాల దాకా పడిపోయావు. గంధం ఆ తర్వాత రసం అనుభవించాలి. ఆ విషయాన్నీ అనుభవించాలి దానిని ఆశ్రయించాలి, దాంట్లో మునిగిపోవాలి. సాంతం మునిగిపోయి దుఃఖం వచ్చాక, అపుడు కళ్ళు తెరిచి ఎందుకొచ్చింది ఈ దుఃఖం, అని విచారణ చేసాం. చేస్తే నాకెందుకు వచ్చిన గోల ఇది అనిపించింది. కానీ ఎప్పుడు, మొత్తం మునిగిపోయిన తర్వాత విచారణ చేస్తే ఏమి ప్రయోజనం. ఈ పశ్చాత్తాపం వలన ఎం ప్రయోజనం లేదు. మల్ల మొదటికొచ్చేసావు. పూర్వ తాపం ఉండాలి, పనిలోకి దిగక ముందే సాక్షిగా ఉండాలి. కాబట్టి నీవు మెలకువలో సాక్షివని విశ్వుడవని తెలుసుకోవాలి.

Shri Vidya Sagar Gari 21 Speeches – File No: 10 ; Page – 5

If you are able to see Atma everywhere and if you see Atma in everyperson then you are Pratyagatma. If you get that kind of wisdom, then you attain Atmanubhava or Realisation of Self at Microcosm level. Visva, Taijasa, Pragna and Pratyagatma are the names of Sakshi or witness at Microcosm level. For example: You saw someone and felt that she is very beautiful. It means your eye is working in this situation and also visual faculty of eye is working which is a vishaya (Pleasure of the sense organs) for the eye. And you are gaining pleasure because of that vishaya, in waking state. But who is witnessing this pleasure – “I” is witnessing this pleasure. If this “I” behaves like a witness, then he is called Visva. If he comes down one level to the pleasure, then you fall to the level of that pleasure object. If he falls down further, then he becomes immersed in that pleasure object and assumes that her beauty is the only truth. If he falls further down, he will desire friendship with her. He will desire to see her again and again. In this way he will completely fall and submerge in the mundane things of the World.

We have to realise that everything that we see in this world is just an optical illusion. If you see something in this World, we don’t get pleasure immediately. The fall explained in the previous paragraph(From “I” to Vishaya to pleasure) happens within a fraction of second inside us. We have to carefully inquire that fraction of second and separate ourselves from every illusion. Ask yourself “Who am I”, I am Atma or Pure Consciousness. I am the Visva or the witness of the waking state. We all have to attain this state of visva at first. Taijasa and Pragna states can not be attained without achieving the state of Visva or the witness of the waking state. Therefore we have to inquire before doing any work and before every thought in waking state. Every work and every thought will be definitely associated with the 5 Indriyas or Sensory faculties. 1.Vision 2. Hearing 3. Smell. 4. Taste. 5. Touch. Example: You heard someone playing a Musical instrument. You felt happy, that is the pleasure object of Hearing sense. Hearing faculty received the sound and I am Witness. The hearing faculty heard the music and felt happy.

We can observe 3 states here. 1. Sensory Faculty or Indriya (Ear) 2. Pleasure object or Vishaya(Music) 3. Pleasure. I am not any of these, I am the witness or Sakshi. I witness the pleasure also, I do not get submerged in the mundane Worldly pleasures, I am Pure Consciousness. As long as I behave like a witness, I am Visva. If you are not being a witness then you fall down to the level of pleasure. You feel that nobody can sing like her. If you further fall down to the level of Pleasure object then you feel like meeting her once. After that the hearing faculty is done, now you are attracted to that person and eye faculty is working. In this way one after the other all the 5 faculties start pushing you from inside. We basically start with one sense faculty at first, if we can carefully inquire at that first stage itself, then the other faculties will not bother us. But we started with Hearing faculty at first then, we fell down to Vision, Smell,Taste and Touch. So we felt that we have to enjoy this pleasure object and we have to submerge in it. After you completely submerged yourself, it brought sorrow and then you opened your eyes and inquired “Why did it bring sorrow?”. Then you felt “why did I get into this unnecessary mess”. But it is useless to inquire after experiencing sorrow and grief. We should ideally inquire before falling at the first stage itself. We have to be a witness before getting involved in any work or thought. Therefore we have to realise that I am Visva or witness of the waking state.

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/