స్థిత ప్రజ్ఞత

సముద్రం ఎప్పుడు తన నిజ
స్థితిలో తాను ఉంటుంది..
ఎన్నో నదులు వచ్చి తన
యందు కలిసినా పొంగదు…
సూర్యుడు తన నుంచి
నీటిని ఆవిరి చేసినా కృంగదు…
ద్వంద్వములకు చలించని
తత్వమే స్థితప్రజ్ఞత…
మనం కూడా
ఎన్నో తలంపులు మనస్సులో
వచ్చి పోతున్నప్పటికి వాటిని
సాక్షిగా చూస్తూ మన ఆత్మ స్థితి
యందు మనం వుండుటయే
స్థితప్రజ్ఞత….
భగవంతుడు కి దగ్గరగా చేరాలంటే ఈ స్థితికి ఎదగాలి…
దీనికి , ప్రేమ , సేవ, సర్వత్ర హరిచింతన, మరియు మన సాధనయే మార్గం…
ఈ విషయాన్ని ఆ సముద్రం
తాను ఆచరించి మనకు
గురువుగా నేర్పుతుంది.

*_🍁శుభమస్తు🍁_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

Author: go123

https://webtemplatesmonster.blogspot.in/