శివరాత్రి మహత్యం

*శివ” అంటే “శివుడు – “రాత్రి” అంటే “పార్వతీదేవి*_

🔱☘🔱☘🔱☘🔱☘🔱

శివరాత్రి …
“శివ” అంటే “శివుడు;; – “రాత్రి” అంటే “పార్వతి”
వీరిద్దరికీ వివాహమైన రాత్రే “శివరాత్రి”.

వీరికి పూర్వం వివాహమైన దంపతులు.. పురాణాలలో కనిపించరు.

అందుకే…

పార్వతీ పరమేశ్వరులను “ఆదిదంపతులు” అన్నారు.

వీరి కళ్యాణం, జగత్కల్యాణానికి నాంది అయినది. కనుకనే “శివరాత్రి” విశ్వాని కంతటికీ పర్వదినం అయింది.

అంతేకాదు,
తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ, విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు, పరమేశ్వరుడు తేజోలింగముగా ఉద్భవించి, వారికి జ్ఞానోపదేశం చేసినది.

ఈ “శివరాత్రి” నాడే. అందుకే మాఘబహుళ చతుర్దశి తిథినాడు అర్థరాత్రి సమయాన్ని “లింగోద్భవ” కాలంగా భావించి శివరాధనలు, శివార్చనలు చేయడం ఆచారమైంది.

ఈ శివరాత్రి పర్వదినం నాడే “శివపార్వతులకు” కళ్యాణం చేసి ఆనందించడం అలవాటై పోయింది.

అభిషేకం ఎందుకు చేయాలి ?

“అభిషేక ప్రియం శివః” అన్నారు.

శివుడు అభిషేక ప్రియుడు.

నిర్మలమైన నీటితో అభిషేకమంటే శివునకు చాలా యిష్టం.

ఇందులో అంతరార్థం ఏమిటంటే –
“నీరము” అంటే “నీరు” నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీమహావిష్ణువును “నారాయణుడు” అన్నారు.

నీరు సాక్షాత్తు విష్ణుస్వరూపం. అందుకే శివునకు “నీరు” అంటే చాలా యిష్టం.

అందుకే శివునికి జలాభిషేకం చేస్తున్నప్పుడు
ఆ నీటిస్పర్శతో నారాయణ స్పర్శానుభూతితో
“శివాయ విష్ణురూపాయ శివరూపాయ
విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః”
శివునకు అభిషేకం చేసే ప్రక్రియలో క్షీరాభిషేకమనీ, గందాభిషేకమనీ, తేనెతో అభిషేకమనీ … చాలా రకాల అభిషేకాలు చోటు చేసుకున్నాయి.

కానీ ఈ అభిషేకాలన్నింటికన్న “జలాభిషేకం” అంటేనే శివునకు ప్రీతికరం.

అందులోనూ “గంగాజలాభిషేకం” అంటే మహా యిష్టం. ఎందుకంటే “గంగ” “విష్ణుపాదోద్భవ” విష్ణు పాదజలమైన గంగ అంటే శివునకు ఆనందకరం,
అందుకే శివుడు, గంగను తన శిరసున ధరించి గౌరవించాడు.

ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం “చితాభాస్మాభిషేకం” ఎందుకంటే ఆయన “చితాభస్మాంగదేవుడు” కదా!

ఈ అభిషేకం, ఉజ్జయినిలో “మహాకాలేశ్వరునికి” ప్రతినిత్యం ప్రాతఃకాలంలో తొలి అభిషేకంగా జరుగు తుంది.

ఏది ఏమయినా, శివాభిషేకం …
సంతత ధారగా జలంతో అభిషేకించడమే ఉత్తమం …

ఎందు కంటే…

“జలధార శివః ప్రియః” అన్నారు కదా! ఈ అభిషేకాన్ని “రుద్రైకాదశిని” అనబడే నమక, చమకాలతో చేయాలి.

అనంతరం మారేడు దళాలతో, తుమ్మిపూలతో అర్చించాలి.

నమకంలోని “నమశ్శివాయ” అను పంచాక్షరీ మంత్రంలో”శివ” అనే రెండు అక్షరాలు “జీవాత్మ” అనే హంసకు రెండు రెక్కల వంటివి.

జీవుని తరింప జేయడానికి
“శివాభిషేకం” అత్యంత ఉత్తమైన సులభ మార్గమని, “వాయుపురాణం” చెబుతుంది.

“వేదేషు శతరుద్రీయం, దేవతాను మహేశ్వరః” అనునది సూక్తి.

దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో,
వేదాలలో శతరుద్రీయం అంత గొప్పది.

నమక, చమకాలు గల ఈ రుద్రంతో శివునకు అభిషేకం చేస్తే, సంతాన రాహిత్య దోషాలు,
గ్రహబాధలు తొలగి పోతాయని ఆవస్తంబు ఋషి చెప్పాడు.

అందుకే,
శివుని ప్రతినిత్యం అభిషేకించాలి.

అలా ప్రతినిత్యం అభిషేకం చెయ్యడం కుదరని వారు
ఈ మహాశివరాత్రి నాడయినా భక్తిగా అభిషేకిస్తే అనంత పుణ్యం పొందుతారు.

“శివరత్రౌ అహోరాత్రం నిరాహారో జితేంద్రియ: |ఆర్చయేద్వా యధాన్యాయం యధాబలమ చకం ||యత్ఫలం మమమ పూజాయాం వర్షమేకం నిరంతరం |
తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చానాత్ ||

శివరాత్రినాడు పగలు, రాత్రి ఉపవాస ముండి, ఇంద్రియ నిగ్రహంతో శక్తివంచన లేకుండా, శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించిన వారికి, సంవత్సర మంతా నన్ను అర్చించిన ఫలం ఒక్క “శివరాత్రి” అర్చన వలన లభిస్తుందని” “శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు.

శివరాత్రికి ముందు రోజున,
అనగా మాఘబహుళ త్రయోదశినాడు ఏకభుక్తం చేసి,
ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిదురించాలి.

మరునాడు “మాఘబహుళ చతుర్దశి” శివరాత్రి పర్వదినం కనుక, ప్రాతః కాలాన్నే లేచి, స్నానాదికాలు పూర్తిగావించుకుని, శివాలయానికి వెళ్ళి
ఆ రోజు మొత్తం శివుని అభిషేకించాలి.

రాత్రంతా జాగరణ చేస్తూ, శివుని అర్చించాలి.

లింగోద్భవ కాలంలో అభిషేకం తప్పని సరిగా చేయాలి.

తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి, చతుర్దశి ఘడియలు పోకుండా అన్నసమారాధన చేయాలి.

నమక,
చమకాలతో అభిషేకం చేయలేనివారు,

“ఓం నమశ్శివాయ” అనే మంత్రాని పఠిస్తూ చేసినా అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు సాంబశివుడు.

బిల్వపత్రాల విశిష్టత.

శివపూజకు బిల్వపత్రాలు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి.

మారేడు వనం కాశీక్షేత్రంతో సమానం … అని శాస్త్రప్రమాణం.

మారేడు దళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది.

సాలగ్రామ దానఫలం,
శత అశ్వమేధయాగాలు చేసిన ఫలం,

వేయి అన్నదానాలు చేసిన ఫలం,
కోటి కన్యాదానాలు చేసిన ఫలంతో సమానం,
ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని”బిల్వాష్టకం”లో చెప్పబడింది.

“ఏకబిల్వం శివార్పణం” అని శివుని అర్చిస్తే,
అనేక జన్మల పాపాలు నశిస్తాయి.

బిల్వదళం లోని మూడు ఆకులూ, సత్త్వ,
రజ,
స్తమోగుణాలకూ, శివుని త్రినేత్రాలకూ, త్రిశూలానికి ప్రతీకలు. ఆ మూడు ఆకులే త్రిమూర్తులు.

బిల్వదళం ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక.

బిల్వదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి.

ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి.

ఆలోపు
ఆ బిల్వదళాలు వాడినా దోషం లేదు. కానీ,
మూడు దళాలు మాత్రం తప్పని సరిగా ఉండాలి.

జాగరణ ఎందుకు చేయాలి..

క్షీర సాగర మధన సమయంలో జనించిన హాలా హలాన్ని భక్షించిన శివుడు …

మైకంతో నిద్రలోకి జారుకుని ఎక్కడ మరణిస్తాడో …

అన్న భయంతో సకలదేవ,
రాక్షస గణాలూ, శివునకు నిద్ర రాకుండా ఉండాలనీ తెల్లార్లూ శివసంకీర్తనం చేస్తూ జాగరణం చేసారట.

ఆ జాగరణే “శివరాత్రి”నాడు భక్తులు ఆచారమైంది.

“జాగరణ” అంటే నిద్రపోకుండా సినిమాలు చూస్తూ, గడపడం కాదు.

జాగరూకతో శివుని భక్తిగా అర్చించడం.

శివుడు నిరాడంబరుడు శివుడు నిర్మల హృదయుడు.

శుద్ధ స్ఫటిక మనస్కుడు.

అందుకు నిదర్శనగా స్ఫటిక మాలలు, రుద్రాక్ష మాలలూ ధరిస్తాడు.

మహాదేవుడు ఎంతటి నిరాడంబరుడో ఆయన ఆకృతే చెబుతుంది.

శరీర వ్యామోహం లేని వాడు కనుకే,
తైల సంస్కారంలేని జటాజూటంతో, చితాభస్మాన్ని పూసుకుని, గజచర్మాన్ని ధరించి, పాములను మాలలుగా వేసుకుని నిగర్విగా తిరుగుతాడు.

ఆయన జీవన వృత్తి భిక్షాటనం.

అందుకనే ఆయనను “ఆదిభిక్షువు” అన్నారు.

ఆయన భుజించే భోజన పాత్ర కపాలము.

ఆయన నివాస స్థానము శ్మశానం.

ఇంతటి నిరాడంబర దేవుడు మనకు ఎక్కడా కనిపించడు.

ఈ “నిర్జనుడు”

మనకేం వరాలిస్తాడో సందేహం మనకు అనవసరం.

ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాత.

ఈశ్వర భక్తుడైన “రావణుడు”

ఎంతటి మహాదైశ్వర్య సంపన్నుడో మనకందరకూ తెలిసినదే.

బ్రాహ్మణ వంశంలో జన్మించి,
వేదాలు అభ్యసించి చెయ్యరాని పాపాలు చేసినా, మహాశివరాత్రినాడు తనకు తెలియ కుండానే జాగరణ చేసి, శివపూజ చేసి, శివప్రసాదం తిన్న “గుణనిధి” మరణానంతరం శివసాన్నిధ్యం పొందాడు.

అతడే మరుజన్మలో ధనాధిపతి అయిన కుబేెరుడుగా జన్మించి ఉత్తర దిక్పాలకుడయ్యాడు. అదే”శివరాత్రి” మహత్యం.

రావణసంహారం చేసిన శ్రీరాముడు, బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టు కోవడానికి సాగరతీరంలో “సైకతలింగ” ప్రతిష్ఠచేసి పాపవిముక్తుడు అయ్యాడు.

ఆ క్షేత్రమే “రామేశ్వరం”.

శివుని శరణుకోరి, మార్కండేయ, యమపాశ బంధవిముక్తుడై చిరంజీవి అయ్యాడు.

శివునికి తన నేత్రాలతో అర్చించిన “తిన్నడు” భక్తకన్నప్పగా వాసికెక్కాడు.

ఇలా చెబుతూ పొతే ఎందరో మహాభక్తుల చరిత్రలు మనకు దృష్టాంతాలుగా కనిపిస్తాయి.

అట్టి నిరాకార,
నిర్గుణ,
నిరాడంబర,
నిగర్వి అయిన
ఆ “నిటలేక్షుని; ప్రేమానురాగాలు అనంతం.

ఎల్లలు లేనిది ఆయన మమకారం.

“శివా”అని ఆర్తిగా పిలిస్తే, చెంత నుండే ఆశ్రిత వత్సలుడాయన.

దేహం నుండి జీవం పోయి, పరలోకానికి పయనమయ్యే వేళ,

ఆ పార్థివదేహం వెంట కన్నీళ్ళతో భార్య గుమ్మంవరకే వస్తుంది. బిడ్డలు,
బంధువులు మరుభూమి వరకూ వస్తారు.

ఆ తర్వాత,
వెంట ఎవరూ రారు.

కపాలమోక్షం కాగానే, అందరూ ఋణం తీరిపోయిందని వెళ్ళిపోతారు.

దిక్కులేక అనాథకాష్టంలా కాలుతున్న ఆ కాష్టం దగ్గర…
“నీకు నేనున్నారురా దిక్కు” అంటూ త్రిశూల పాణియై తోడుగా నిలబడే దేవదేవుడు “శివుడు” ఒక్కడే. పంచభూత్మికమైన పార్థివదేహం చితాభస్మంగా మారే వరకూ సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి …
ఆ పరమేశ్వరుడు ఒక్కడే..

ఇది చాలదా మన జన్మకు?

ఏమిస్తే ఆ సదాశివుని ఋణం తీరుతుంది.?-

భక్తిగా ఓ గుక్కెడు నీళ్ళతో అభిషేకించడం తప్ప.-

ప్రేమగా ఓ మారేడు దళం సమర్పించడం తప్ప.

తృప్తిగా “నమశ్శివాయ” అంటూ నమస్కరించడం తప్ప.

*అందుకే…*

*”మహాశివరాత్రి”*
*నా డైనా…*

*మహా దేవుని స్మరిద్దాం…*

_*ఆస్మరణలో ధ్యాన నిమగ్నులమై…*_

_*ఈ రోజు పూర్తిగా మౌనం లో వుండి…*_

_*ఆ మహేశ్వరుని విశ్వమయ ప్రాణ శక్తిని…*_

_*ఈ రోజు మౌన ధ్యాన సాధన అనే జాగరణ లో వుండి…*_

_*ఆ మహా శివుని శక్తిని…ఆవాహన చేసు కుందాం…మాష్టర్స్…*_

_*మోక్ష సామ్రాజ్యాన్ని అందు కుందాం..మాష్టర్స్…*_

_*”ఈశాన స్సర్వ విద్యానాం – ఈశ్వర స్సర్వ భూతానాం – బ్రహ్మాధి పతిర్ |బ్రాహ్మణాధి పతిర్ బ్రహ్మ శివోమే అస్తు.*_

_*ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర…*

🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏

 

మాఘ పౌర్ణమి విశిష్టత

రేపు మాఘ పౌర్ణమి..!!
ఓం నమః శివాయ..!!

మాఘ పౌర్ణమి విశిష్టత.
మాఘపూర్ణిమ , మహా మాఘి
ఇది విశేష పర్వదినం.
స్నానానికి ప్రాముఖ్యమైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయం ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగా
చేసే స్నానం) ఈ రోజునైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి.

ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం.
తిధుల్లో ఏ పూర్ణిమ అయిన సంపూర్ణంగా దైవీశక్తులు దీవించే పుణ్యతిధే.
ఈ తిధినాడు ఇష్టదేవతారాధన, ధ్యాన జపాది అనుష్టానాలు మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి.

ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది.
అన్ని పూర్ణిమల్లోకి మఘ, కార్తీక, వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతొ ఉత్కృష్టమైనవి.
వాటిని వ్యర్ధంగా గడుపరాదుని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.

వైశాఖీ కార్తీకీ మాఘీ
తిథయో౭ తీవ పూజితాః!
స్నాన దాన విహినాస్తా
ననేయాః పాండునందన!!

స్నానదాన జపాది సత్కర్మలు లేకుండా వృథాగా
ఈ మూడు మాసాలు పూర్ణిమలను గడుపరాదు.

మాఘ పూర్ణిమ నాడు ” అలభ్య యోగం ” అని కూడా అంటారు.
అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా
అది గొప్ప యోగ మవుతుంది.
అది అంత తేలికగా లభించేది కాదు.

స్నానంం చేస్తున్నప్పుడు పఠించాల్సిన శ్లోకం.

దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం

మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ”

అని పఠించి, మౌనంగా స్నానం చేయాలి,
అంటే “దుఃఖములు, దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ
ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను.

కనుక ఓ గోవిందా! అచ్యుతా! మాధవా!
ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు”
అని అర్థం.

ఆ తరువాత …
“సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ
త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా”

అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి.
అంటే “ఓ పరంజ్యోతి స్వరూపుడా!
నీ తేజస్సుచే నా పాపములు సర్వము
వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు
బడి నశించుగాక” అని అర్థం.

ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత, పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని,
ఇష్టదైవాన్ని ఆరాధించాలి.
ఆ తర్వాత, దానధర్మాలు చేయాలి.
వస్త్రములు, కంబలములు [దుప్పటిలు],
పాదరక్షలు, గొడుగు, తైలము, నెయ్యి, తిలపూర్ణఘటము, బంగారము, అన్నము
మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది.

ఓం నమః శివాయ..!!
సర్వే జనా సుఖినోభవంతు..!!

 

చిరుధాన్యాల పైన డాక్టర్. ఖాదర్ వలి గారి ప్రశ్నలు సమాధానాలు

సిరిధాన్యాల వినియోగదారుల కు వచ్చే సాధారణ సందేహాలు… సమాధానాలు….

*సిరిధాన్యాలు అంటే ఏమిటి ?*

వరి బియ్యం, గోధుమలు వలె ఇవికూడా ఆహారంగా స్వీకరించడానికి అనువైన ధాన్యం. *పూర్వం అంటే సుమారు 100 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు మన నేలల్లో/ భూమిలో పండించి సంపూర్ణ ఆహారంగా స్వీకరించిన ధాన్యాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిరిధాన్యాలే*…

కాల క్రమంలో నీటి డ్యాము ల నిర్మాణం,నీటి లభ్యత, వ్యవసాయ విప్లవం, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆధిపత్య ప్రభావంతో మన ప్రాచీన, సంప్రదాయ పంటలయిన

#కొర్రలు
#సామలు
#ఊదలు
#అరికలు
#అండుకొర్రలు

అనే పంచ చిరు (సిరి) ధాన్యాల సాగు మన ప్రాంతాల్లో కనుమరుగై వాటి స్థానంలో నీటి ఆధారిత పంటలయిన వరి, గోధుమలు మన భూముల్లో పండించడం ప్రారంభించి , వరి బియ్యం, గోధుమలు మన ప్రధాన ఆహారంగా తీసుకోవడం ప్రారంభించాము, ఈ ఆహారం వల్ల గ్లూకోస్ ఏక మొత్తం లో ఓకే సారి రావడం వల్ల, గ్లూకోస్ మనకు కావాల్సిన డానికి కంటే ఎక్కువైనది ఫ్యాట్ గ మారి బరువు పెరగడం, తద్వారా మన శరీరం లోకి అన్ని దీర్ఘకాలిక రోగాలు , సాధారణ రోగాలు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ అరుగుదల రావడం ప్రారంభించాయి.

*సిరిధాన్యాలను ఎలా వండుకోవాలి ?*
ఏ సిరిధాన్యము అయినా 8 గంటలు నానబెట్టి వండుకోవాలి. రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవడం, ఉదయం నానబెట్టి రాత్రి వండుకోవడం ఉత్తమం.

*ఎందుకు నాన బెట్టాలి.?*
అన్ని సిరిధాన్యాల్లో ఫైబర్ శాతం మన శరీరానికి అవసరం అయినంత ఉంటుంది, ఫైబర్ నిష్పత్తి 65:8 నుండి 65:12.5 వరకు ఉంటుంది . అంటే పిండి పదార్థం 65 ఉంటే పీచు పదార్థం (ఫైబర్) కనీసం 8 శాతం ఉంటుంది…

వరి బియ్యంలో పిండి పదార్థం నిష్పత్తి 395: 0.2 అంటే దాదాపు పీచు పదార్థం శూన్యం…
ఆవాల పరిమాణం కంటే కొద్దిగా పెద్ద పరిమాణం లో వుండే సిరిధాన్యాల కేంద్రం నుండి పై వరకు పొరలు పొరలు గా ఫైబర్ ఉంటుంది . భగవంతుని అద్భుత సృష్టి తో సుమారు ఏడు పొరల్లో నిక్షిప్తమయిన ఈ ఫైబర్ పూర్తిగా నానడానికి 8 గంటలు పడుతుంది. అందుకే ఉదయం నానబెట్టి రాత్రి, రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవాలి.

*సిరిధాన్యాలతో ఏ ఆహారం చేసుకోవచ్చు.?*
సిరిధాన్యాలతో అన్నం , ఇడ్లీ లు, దోశ, ఉతప్ప, పెరుగన్నం, సాంబారు అన్నం , సర్వపిండి, మురుకులు, దోసకాయరొట్టె, గారెలు, ఇలా 30 రకాల పైన వెరైటీ లు వండుకోవచ్చు. వరి బియ్యం తో వండే ప్రతి వంటను సిరిధాన్యాలతో వండుకోవచ్చు.

*ఎందుకు తినాలి ?*
ఆహారపు అలవాట్ల ద్వారా సంక్రమిస్తున్న అన్ని వ్యాధులను దూరం చేసుకోవడానికి, పూర్తి ఆరోగ్యంగా ఏ వ్యాధి రాకుండా ఉండడానికి, ఊబకాయము సమస్య పోవడానికి సిరిధాన్యాల ను సంపూర్ణ ఆహారంగా తీసుకోవాలి.

*ఎన్నిరోజులు తినాలి?*
మన ఊపిరి ఉన్నంత కాలం సిరిధాన్యాల నే సంపూర్ణ ఆహారంగా స్వీకరించాలి.

*ఎలా తినాలి ?*
ఆరోగ్యంగా ఉన్నవారు సిరిధాన్యాల రెండు, రెండు రోజులు మార్చి, మార్చి తినాలి, అంటే రెండు రోజులు కొర్రలు, రెండు రోజులు సామలు, రెండు రోజులు ఊదలు అలా…సైకిల్ లా తీసుకోవాలి.
అన్ని విడివిడిగా తినాలి,
ఒక దానితో ఒకటి కలుపవద్దు

*5 రకాలు తప్పనిసరిగా తినాలా?*
అన్ని తప్పనిసరిగా తినాలి, ఎవయినా అందుబాటులో లేనప్పుడు అందుబాటులో ఉన్న సిరిధాన్యాలను తినాలి.

*పొట్టు తీయని unpolished వే తినాలా?*
పొట్టు తీయని(unpolished) తినడం ఉత్తమం.
Unpolished లభించనప్పుడు పొట్టు తీసిన polished సిరిధాన్యాలు ఆహారంగా తీసుకొన్నా నష్టం లేదు.

*సిరిధాన్యాల ధరలు ఎందుకు అధికంగా ఉన్నాయి?*
సిరిధాన్యాలను పండించే వారు తక్కువగా వున్నారు, స్వీకరించే వారు అధికమయ్యారు, డిమాండ్ కు సరిపడా సప్లయి లేనందున, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా సప్లయి చేయాల్సివస్తుంది…ఇతర రాష్టలు సిరిధాన్యాల ను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నందున వాటి ధరలు అధికంగా ఉన్నాయి.

*ఏ నూనెల ను వాడాలి ?*
ఎట్టి పరిస్థితుల్లో రెఫైన్డ్ నూనెలు వాడవద్దు. గానుగలో పట్టిన నూనెలను వాడడం ఉత్తమం.ఆరోగ్యానికి కొబ్బరినూనె, కుసుమ నూనె లు చాలా మంచిది, కొబ్బరి, కుసుమ, పల్లి, నువ్వుల నూనెలు మార్చి, మార్చి వాడాలి. కొబ్బరినూనె వాసన ఉన్నట్లు అనిపిస్తే కుసుమ నూనె వాడండి, పల్లి నూనెలగా ఉంటుంది, వాసన తో ఇబ్బంది ఉండదు.

*సిరిధాన్యాల పంటలు ఎలా పండించాలి?*
సిరిధాన్యాల పంటల సాగుకు చాలా తక్కువ నీరు అవసరం. ఎకరానికి 4 కిలోల విత్తనాలు సరిపోతాయి, ( నారు పోసి నాటే విధానం లో ఒక ఎకరానికి కిలో లోపు విత్తనాలు సరిపోతాయి). కలుపు తీయాల్సిన , పురుగుల మందులు, రసాయనాలు చల్లాల్సిన అవసరం లేదు.
ప్రకృతిని, భూమిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ భూగర్భ జలాలను కాపాడుతూ రైతులు అధిక లాభాలు సిరిధాన్యాల పంట సాగు ద్వారా పొందవచ్చు. తద్వారా స్థానికంగా అందుబాటులో ఉండి వినియోగదారుల కు సరిఅయిన ధరలో సిరిధాన్యాలు లభిస్తాయి.

*మనం తినకూడని ఆహారపదార్థాలు ఏవి?*
వరి బియ్యం, గోధుమలు, గోధుమ పదార్థాలు, మైదా,పాలు, టీ,కాఫీలు,చక్కెర, అయోడైజ్డ్ ఉప్పు(సముద్రపు నీటిద్వారా తయారు చేసిన ఉప్పు వాడడం మంచిది), మాంసం, గుడ్లు.

ఎంత వివరణ ఇచ్చినా, ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినా ఇంకో కొత్త ప్రశ్న, సందేహం వస్తూనే ఉంటుంది, ఎందుకంటే మనిషి మెదడు ప్రశ్న/ సందేహాల ఉత్పత్తి కేంద్రం….

*ఒకటే గుడ్డి గుర్తు … అయిదు సిరిధాన్యాల ను 6 వారాల నుండి ఆరు నెలలు మార్చి మార్చి తినాలి*,
*వాడకూడనివి పాలు, చెక్కర, రెఫైన్డ్ నూనెలు, వరి బియ్యం, గోధుమలు, ayodized ఉప్పు, మాంసాహారం మానివేసి సిరిధాన్యాల ను సంపూర్ణ ఆహారంగా స్వీకరించడం వల్ల అన్ని అనారోగ్య సమస్యలనుండి బయటపడవచ్చని, ఆరోగ్యవంతులు ఏ అనారోగ్య సమస్యలు దరి చేరవని డాక్టర్ ఖాదర్ వలి గారు చెబుతారు*….

ఇంకా అధిక సమాచారం కోసం సిరిధాన్యాల తో సంపూర్ణ ఆరోగ్యం, అమృతాహారం పుస్తకాలు చదవండి, యూట్యూబ్ లో డాక్టర్ ఖాదర్ వలి గారి వీడియోలు చూడండి.
సంకల్పం, కమిట్మెంట్ ఉండాలి, మనసు శరీరాన్ని నియంత్రించాలి, శరీరం మనసును శాసించకుండా చూసుకోవాలి….

అందరికీ మందులు లేని సంపూర్ణారోగ్యం లభించాలని, ప్రతి వంటింట్లో సిరిధాన్యాల ఘుమఘుమలు వ్యాపించాలని ఆశిస్తూ……..

*సిరిధాన్యాల తో సంపూర్ణ ఆరోగ్యం*
*Dr Vivek Jilla*

 

Amrutha Aaharam By Dr.Khader Valli

Dr. Khader is a food and nutrition expert from Mysore. Doctor Khader Valli garu past 20 years he researched on organic food. He prepared food system for every decease. How to take food systematically. He gives us for good health of his guidance. In telugu his book available for free. Click the link below get pdf.

సిరిధాన్యాలు – ఖాదర్ వలి గారి క్రొత్త పుస్తకం రైతు నేస్తం ఫౌండేషన్

సిరిధాన్యాలు – ఖాదర్ వలి గారి పుస్తకం Google Drive Link

Amrutha Aaharam By Dr.Khader Valli in Scribd

Contact Details of Docter Khader Valli D:

N 965 14TH MAIN ; IV STAGE T K LAYOUT, SUKH SADAN MYSORE
Mysore, Karnataka

Call +91 94485 61472

 

Progressive Web Apps(PWA)

Progressive web apps the next generation for the mobile web.
This is proposed by Google in 2015.

Technologies Combine  The Web & The Mobile Apps.
Enhanced with work services to work offline low-quality networks.

Reliable :- In slow network conditions load instantly never show down.
Fast :- Without disturbed scrolling,  smoothly scroll and respond quickly to  user friendly.
Engaging :- With excellent User experience feel like natural app will be appear.

Click to view tutorial

 

Goods & Services Tax (GST) is an indirect tax all over India

Goods & Services Tax (GST) is an indirect tax all over India to replace taxes impose by the  Central and state governments.

Good and services tax rates will be following like 0%, 5%, 12%, 18%, 28%.

Below  taxes related by the GST:

 • Central Excise Duty
 • Commercial Tax
 • Value Added Tax (VAT)
 • Food Tax
 • Central Sales Tax (CST)
 • Octroi
 • Entertainment Tax
 • Entry Tax
 • Purchase Tax
 • Luxury Tax
 • Advertisement tax

 

 

Revised GST  rates following :

Cinema revised rate 28% in case tickets above Rs.100 and 18% in case of tickets up to Rs.100

Computer printers ,Tractor components , Ball bearing, Roller Bearings, Parts & related Accessories,  Plastic beads , Plastic turpolin, School bags , Pre-cast concrete pipes, Dental wax, All goods, including hooks and eyes, Optical Fiber, Coaxial cables, Winding Wires, Electrical Filaments or discharge lamps, Computer monitors not exceeding 17 inches, Set top Box for TV, CCTV, Recorder, Printers, Aluminium foil, Two-way radio (Walkie talkie) used by defence, police and paramilitary forces etc. revised from 28% to 18%

 

Exercise books , Cutlery, Packaged food, including some fruits & vegetables, toppings, pickles, instant food, sauces, Spoons, forks, ladles, skimmers, cake

servers, fish knives, tongs revised from 18% to 12%

 

Cashew, Agarbatti, Insulin, Postage or revenue stamps, stamp-post

marks, first-day covers, etc., Numismatic coins, Braille paper, braille typewriters, braille

watches, hearing aids  :   12% to 5%

 

Rough precious and semi-precious stones revised from 3% 0.25%

 

Human hair, dressed, thinned, bleached, Bones and horn cores, bone grist, bone meal, Cereal grains hulled, Palmyra jiggery, Children’s’ picture, drawing or colouring

Books, Salt, Palmyra jiggery, Cereal grains hulled, revised  to  0%

 

 

First woman Field Officer in BSF – ” Thanushree Pareek “

Tanushree completed training on Saturday May, 2017, Union Home Minister Rajnath put himself on the shoulders the stars that indicates the status of officer.

In 51 years history Thanushree Pareek 25 years old woman recorded as a First woman Field Officer in BSF in the country largest border guarding force. She is from Bikaner in Rajastan state.

Tanushree, told like, “I think my parents especially my father has raised me to become a good human being. We are two sisters with me being the older one. My father always supported me in chasing my dreams and doing whatever I wished to do in life. I think that really matters.”

“I don’t know about the future as I am also preparing for UPSC exams and interested in joining IPS. But at this point of time I think I am well prepared to grab this opportunity of serving as an assistant commandant in BSF,”

 

More people attracted with NOKIA 3310 phone

Occation of Mobile World Congress(MWC) more people attracted with NOKIA 3310 phone It has been priced at EUR 49 and Nokia 3, Nokia 5, Nokia 6 phones also going to releasing. These four phones ready to relasing end of the May or June first week… told HMD Global India Vice President Ajay Mehatha.
Present discussion on 3310 releasing. Why because before android phone they are ready to releasing. All phones are manufacturing in india with foxconn. If they are not ready to do manufacturing with nokia, nokia will do work with vietnam or china.

Nokia 3310 (2017) Features :

 1. The phone comes with a 2.40-inch display with a resolution of  240 pixels by 320 pixels.
 2. Dual SIM (GSM and GSM) mobile that accepts Micro-SIM and Micro-SIM
 3. 16MB of internal storage that can be expanded up to 32GB
 4. Nokia 3310 (2017) packs a 2-megapixel primary camera
 5. 1200mAh removable battery 1200mAh
 6. Connectivity options include Bluetooth and FM.
 

The Tipu armoury is shifting with cranes in safe selected place.

Tipu Sultan, the great king who fought with britishers, experts are working hard to move away the arsenals. This historic construction is core of the soldiers. This construction is Srirangapatanam in Mandya district, near railway station.

Expansion of railway lines between the maisuru – Bangalore. For this works getting disturbance. So without threat the armoury is shifting with cranes in safe selected place.